ప్రత్యేకం : ‘మేముసైతం’లో తంబోలా గేమ్ ఆడనున్న స్టార్స్

ప్రత్యేకం : ‘మేముసైతం’లో తంబోలా గేమ్ ఆడనున్న స్టార్స్

Published on Nov 14, 2014 12:35 PM IST

mimu-sitham
హుదూద్ తుఫాన్ బాధితుల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఒక్కటై నిర్వహిస్తున్న ‘మేముసైతం’ కార్యక్రమం నవంబర్ 30న జరగనున్న సగంతి మీకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి అందరు స్టార్స్ కలిసి రానున్నారు. ఈ వేడుకకి వస్తున్నా ప్రతి హీరో అన్ని ఈవెంట్స్ లో లాగా ఓ సెలబ్రిటీలా వచ్చి కూర్చొని చూసి వల్లకుండా ప్రతో ఒక్కరూ ఒక్కో రకమైన కార్యక్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే స్టార్స్ క్రికెట్ మ్యాచ్ మరియు అంత్యాక్షరి ప్రోగ్రామ్స్ చేయనున్నారు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ లో స్టార్స్ అందరూ కలిసి సందడి చేసేలా మరో ప్రోగ్రాం ని డిజైన్ చేసారు. అదే తంబోలా గేమ్.. ఈ తంబోలా గేమ్ లో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్ పాల్గొననున్నారు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండే ఈ గేమ్ ని సుమారు ఒకటిన్నర గంటపాటు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ తంబోలా కార్యక్రమాన్ని అక్కినేని నాగార్జున దగ్గరుండి డీల్ చేయనున్నారు.

టాలీవుడ్ లోని స్టార్స్ అందరూ కలిసి ఒక్క చోట చేరి సందడి చేయనున్న ఈ ప్రోగ్రాం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మేముసైతం కోసం నిర్వహిస్తున్న స్టార్స్ క్రికెట్ మ్యాచ్, డైన్ విత్ స్టార్స్ మరియు బంపర్ మెగా డ్రాకి సంబందించిన టికెట్స్ ని బుక్ మై షోలో కొనుక్కోవచ్చు.

తాజా వార్తలు