ఎక్స్ క్లూజివ్ న్యూస్ : తేజ సజ్జ తో ‘హాయ్ నాన్న’ క్యూటీ..!

ఎక్స్ క్లూజివ్ న్యూస్ : తేజ సజ్జ తో ‘హాయ్ నాన్న’ క్యూటీ..!

Published on Apr 3, 2024 7:58 AM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన లేటెస్ట్ టాలీవుడ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “హను మాన్” (Hanu Man). దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ సూపర్ హీరో చిత్రం అన్ని అంచనాలు మించి పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రం తర్వాత తేజ సజ్జ క్రేజ్ కూడా మారగా తాను ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ దర్శకుడు మాస్ మహారాజ్ రవితేజతో “ఈగల్” (Eagle Movie) అనే ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ని అందించిన కార్తీక్ ఘట్టమనేని తో ఓ సినిమా చేస్తున్నాడు.

మరి ఈ సినిమా సంబంధించి ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ మీకోసం తెచ్చాము. దీనితో ఈ సినిమాలో తేజ సజ్జ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. “అశోక వనంలో అర్జున కళ్యాణం” చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె రీసెంట్ గానే నాచురల్ స్టార్ నాని హిట్ సినిమా “హాయ్ నాన్న” (Hi Nanna) లో కూడా క్యూట్ పెర్ఫామెన్స్ అందించింది. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో రానుంది. మరి వీరి కాంబినేషన్ లో ఏ తరహా సినిమా వస్తుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు