ప్రత్యేకం : ‘మేము సైతం’ కోసం స్టార్ హీరోల స్పెషల్ క్రికెట్ మ్యాచ్

ప్రత్యేకం : ‘మేము సైతం’ కోసం స్టార్ హీరోల స్పెషల్ క్రికెట్ మ్యాచ్

Published on Nov 9, 2014 5:20 PM IST

memu-saitham-cricket

టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి హుదూద్ బాధితుల కోసం నవంబర్ 30వ తేదీన ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సుమారు 13 గంటల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ టెలీథాన్ ప్రోగ్రాం గురించి రోజుకో ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. తాజాగా మేముసైతం ప్రోగ్రాం లోకి స్టార్ హీరోల క్రికెట్ మ్యాచ్ కుడా వచ్చి చేరింది.

ఇక క్రికెట్ మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ప్రసతుతం యంగ్ స్టార్ హీరోస్ నాలు టీం లుగా డివైడ్ అయ్యి నవంబర్ 30న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో ప్రతి ఒక్క టీంలో 6 మంది ప్లేయర్స్ ఉంటారు, అలాగే 6 ఓవర్లు మాత్రమే ఉంటాయి. ఇక టీం వివరాల్లోకి వెళితే..

1. ఎన్.టి.ఆర్ టీం

2. రామ్ చరణ్ టీం

3. బాహుబలి టీం

4. అనుష్క టీం

ఈ టీమ్స్ చూసాక అనుష్క టీం అని షాక్ అవుతున్నారా.? మీరు విన్నది నిజమే అనుష్క టీం తరపున మన హీరోయిన్స్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే అనుష్క టీంలో ఉండ 6 ప్లేయర్స్ లో 5 మంది హీరోయిన్స్ అయితే వీరందరికీ సపోర్ట్ గా అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఆరవ ప్లేయర్ గా అనుష్క టీం తరపున ఆడనున్నాడు. అంటే అనుష్క టీంలో ఆడే ఒకే ఒక్క ఆహేరో అఖిల్ మాత్రమే.. ఈ క్రికెట్ మ్యాచ్ కూడా ‘మేము సైతం’ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే ఓ నాలుగు గంటల పాటు లైవ్ ఇస్తారు. ఈ నాలుగు టీంస్ తరపున ఎవరెవరు ఆడుతున్నారు అనే విషయాలను త్వరలోనే మీకు అందజేస్తాం..

తాజా వార్తలు