తారక్ లుక్ పై అంతకంతకూ పెరుగుతున్న అంచనాలు.!

Published on Apr 3, 2021 2:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే సెన్సేషనల్ పాన్ ఇండియన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ భారీ చిత్రం నుంచి ఇటీవలే కొన్ని సాలిడ్ అప్డేట్స్ కూడా వచ్చాయి. అల్లూరిగా నటిస్తున్న చరణ్ నుంచి ఊహించని విధమైన పోస్టర్ ను విడుదల చేసిన నాటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి.

మరి నిన్ననే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ పాత్రకు సంబంధించిన పవర్ ఫుల్ పోస్టర్ కు కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక మిగిలింది అంతా సిసలైన ఎన్టీఆర్ పోస్టర్ మాత్రమే. భీం గా తారక్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకున్నాడో చూసాము. ఇక మిగిలి ఉంది తారక్ పుట్టినరోజు మాత్రమే కావడంతో వచ్చే మే 20 నాటికి రాజమౌళి అండ్ కో ఎలాంటి పోస్టర్ ను తారక్ ను ఏ లుక్ లో చూపించబోతున్నారు అన్నది ఇప్పటి నుంచే చర్చనీయాంశం అయ్యింది. మరి తారక్ ను ఏ లెవెల్లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :