సమీక్ష : “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” – కొన్ని చోట్ల నవ్వించే రెగ్యులర్ ఎంటర్ టైనర్

సమీక్ష : “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” – కొన్ని చోట్ల నవ్వించే రెగ్యులర్ ఎంటర్ టైనర్

Published on Dec 9, 2023 3:03 AM IST
Extra Ordinary Man Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 08, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర నరేష్, హైపర్ ఆది ఇతరులు

దర్శకుడు : వక్కంతం వంశీ

నిర్మాతలు: ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి

సంగీతం: హారిస్ జయరాజ్

సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

నితిన్ హీరోగా నటించిన సినిమా “ఎక్స్ట్రార్డినరీ మ్యాన్”. దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

అభి (నితిన్) ఒక జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా పేరు తెచ్చుకోవాలని, హీరో కావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నటుడిగా ఎప్పుడూ వెనకే మిగిలిపోతాడు. ఇలా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా మిగిలిన అభి జీవితంలోకి మెరుపులా లిఖిత (శ్రీలీల) ఎంటర్ అవుతుంది. అభితో లిఖిత ప్రేమలో పడుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న అభికి అనుకోకుండా హీరో ఛాన్స్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అభి, సైతాన్ పాత్రలో ఇన్ వాల్వ్ అవుతాడు. అసలు ఈ సైతాన్ ఎవరు ?, ఎందుకు అభి సైతాన్ లా మారాడు ?, ఈ మధ్యలో ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) పాత్ర ఏమిటి ?, చివరికి అభి కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఓ జూనియర్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్ లో హీరోగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన నితిన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా నితిన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన డా. రాజశేఖర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. కాకపోతే ఆ పాత్ర నిడివే కాదు, ప్రాధాన్యత కూడా తక్కువే. కానీ, రాజశేఖర్ ఆకటుకున్నారు. హీరోయిన్ శ్రీలీల తన గ్లామర్ తో అలరించింది. హీరోకి తండ్రికి నటించిన రావు రమేష్ చాలా బాగా నటించాడు. ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి. నితిన్ – రావు రమేష్ మధ్య వచ్చే పంచ్ లు అండ్ కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది.

సుదేవ్ నాయర్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీలు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన యాక్టింగ్ ట్రాక్.. అలాగే ఆ యాక్టింగ్ తో ముడి పడిన సీన్స్.. మరియు విలన్ తో పాటు మిగిలిన పాత్రలు.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు వక్కంతం వంశీ కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లే ఫుల్ ఫన్ తో సాగితే బాగుండేది. కానీ, ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్ లో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి కానీ, తగ్గకూడదు. కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదు.

హీరో రైజ్ కోసంవిలన్ సిల్లీ ప్లాన్స్ వేయడం కూడా బాగాలేదు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా సాగుతాయి. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. ఫస్ట్ హాఫ్ నిజంగానే ఫన్ తో సాగింది. ఆ ఫన్ ను కూడా దర్శకుడు సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా హారిస్ జయరాజ్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా ఆర్థర్ ఏ విల్సన్ ఐ ఏఎస్ సి, యువరాజ్ జే, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు ఎన్. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, జూనియర్ ఆర్టిస్ట్ ట్రాక్, మరియు కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, నితిన్ నటన, రాజశేఖర్ గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు