నా పాత్ర మీద నాకు నమ్మకముంది : సంజయ్ దత్

నా పాత్ర మీద నాకు నమ్మకముంది : సంజయ్ దత్

Published on Jan 21, 2012 9:50 AM IST


సంజయ్ దత్ “అగ్నీపత్” చిత్రం లో తన ప్రతినాయక పాత్ర మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రంలో “కాంచన చీనా” అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు.ఈ చిత్రం లో ప్రతినాయక పాత్రను సంజయ్ దత్ చాలా ఇష్టపడి చేశారు ఈ పాత్రలో గుండు తో కనిపించనున్న సంజయ్ దత్ చాలా కష్టపడి మరియు ఇష్టపడి ఈ చిత్రాన్ని చేశారు.

ఈ పాత్ర చిత్రం లో మరియు తన కెరీర్ లో కీలకం అవుతుందని సంజయ్ దత్ చెప్పారు. “అగ్నీపత్” చిత్రం గతం లో అదే పేరుతో వచ్చిన చిత్రానికి రిమేక్ ఆ చిత్రం లో అమితాబ్ బచ్చన్ నటించారు. ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించారు. ఈ చిత్రం జనవరి 26 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు