లంగా ఓణీలో పల్లెటూరి పోజులిస్తున్న ఎఫ్2 బేబీ

లంగా ఓణీలో పల్లెటూరి పోజులిస్తున్న ఎఫ్2 బేబీ

Published on Nov 8, 2019 9:00 PM IST

నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది బబ్లీ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జా. ఆ తరువాత మారుతీ దర్శకత్వంలో శర్వానంద్ సరసన చేసిన మహానుభావుడు చిత్రం కూడా హిట్ కావడంతో వరుస అవకాశాలు పట్టేసింది. ఐతే ఆ తరువాత మెహ్రీన్ నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. ఈ ఏడాది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ తో మెహ్రీన్ ప్రారంభించింది. వెంకటేష్, వరుణ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 బంపర్ హిట్ అందుకుంది. కాగా ఆమె ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ఎంతమంచివాడవురా చిత్రంలో నటిస్తుంది.

పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ ఆన్ లొకేషన్స్ స్టిల్స్ కొన్ని బయటకి వచ్చాయి. వాటిలో మెహ్రీన్ లంగా ఓణీలో పక్కా పల్లెటూరి అమాయకపు అమ్మాయిగా క్యూట్ గా ఉంది. సీనియర్ నటి సుహాసిని తో కలిసి వున్న మెహ్రీన్ లుక్స్ చూస్తుంటే ఆమె పాత్ర ఈ మూవీలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎంత మంచివాడవురా చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు