జులై నుండి షూటింగ్ జరుపుకొనున్న ‘ఎఫ్ 2’ చిత్రం


స్టార్ హీరో విక్టరీ ‘వెంకటేశ్‌ ,మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్’ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ ట్యాగ్ లైన్‌ . ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘అనిల్ రావిపూడి’ డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాలో వెంకటేశ్కి జోడిగా త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్కి జోడిగా మెహ‌రీన్ న‌టిస్తున్నారు.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించడంలో మంచి ప‌ట్టు ఉన్న అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను కూడా పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు.‘ఎఫ్ 2′ సినిమా షూటింగ్ జులైలో ప్రారంభం కానుంది . తొలిసారి వెంకటేశ్‌ ,వ‌రుణ్ తేజ్ కలిసి నటిస్తున్నఈ సినిమాని ‘ప‌టాస్‌’, ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’ వంటి హ్యాట్రిక్ విజ‌యాలతో జోష్ లో వున్నా అనిల్ రావిపూడి ఏ విధంగా డైరెక్ట్ చేస్తారో చూడాలి.

Exit mobile version