ఎఫ్ 2 కోసం ప్రత్యేక సెట్ !

ఎఫ్ 2 కోసం ప్రత్యేక సెట్ !

Published on Nov 10, 2018 4:05 AM IST

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ‘ఎఫ్ 2’ అనే చిత్రంలో నటిస్తున్నారని తెలిసిందే. ఇటీవల ఈచిత్రం యొక్క బ్యాంకాక్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకుంది చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగనుంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకమైన బ్రిడ్జి సెట్ ను నిర్మించారు. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ సన్నివేశాలు హిలేరియస్ గా ఉండనున్నాయని సమాచారం. హీరోల తోపాటు హీరోయిన్లు తమన్నా , మెహ్రీన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.

కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావి పూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు