కృష్ణా లో ఎఫ్ 2,వివిఆర్ , ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్ !

Published on Jan 20, 2019 12:07 pm IST


కామెడీఎంటర్టైనర్ ఎఫ్2 ఈ సంక్రాంతి సీజన్ లో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ చిత్రం కృష్ణా జిల్లాలో శనివారం 31.42 లక్షల షేర్ ను కలెక్ట్ చేసి 8 రోజులకుగాను అక్కడ 3.43 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ రోజుకూడా సెలవు రోజు కావడంతో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది ఈచిత్రం.

ఇక వినయ విధేయ రామ కృష్ణా లో శనివారం కేవలం 5.15 లక్షల షేర్ తో సరిపెట్టుకోని 9రోజుల్లో అక్కడ 3.58 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం బాక్సాఫిస్ వద్ద ప్రభావం చూపలేకపోతుంది. ఈ చిత్రం కృష్ణా లో శనివారం కేవలం 1.33 లక్షల షేర్ వసూళ్లను రాబట్టి 11 రోజులకుగాను అక్కడ 1.35కోట్ల షేర్ వసూళ్ళతో సరిపెట్టుకుంది.

సంబంధిత సమాచారం :

X
More