ఎఫ్ 2 లేటెస్ట్ కలెక్షన్స్ !

ఎఫ్ 2 లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 14, 2019 11:29 AM IST


యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ చిత్రం మంచి పాజిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రెవిన్యూని రాబడుతుంది.

కాగా ఏపి మరియు తెలంగాణ వైజ్ గా ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లో 9.23 కోట్ల రాబట్టిందని సమాచారం. అలాగే యూఎస్ లో కూడా ఇప్పటివరకు $882,800 డాలర్స్ దాకా రాబట్టింది. ఇక పండుగ సీజన్ కావడంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు