
ట్రేండింగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్3’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 2019లో వచ్చిన ‘ఎఫ్2’ చిత్రానికి ఇది సీక్వెల్. ‘ఎఫ్ 2’ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఈ సీక్వెల్ మీద మంచి క్రేజ్ ఉంది. రెండు నెలల క్రితమే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండవ షెడ్యూల్ కూడ కంప్లీట్ చేసేశారు టీమ్. వెంకీ, వరుణ్ తేజ్, ఇతర తారాగణం షూటింగ్లో పాల్గొంటున్నారు. సునీల్ సైతం ఇందులో ఒక కీ రోల్ చేస్తున్నారు.
ఆగష్టు 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. వరుణ్ తేజ్, వెంకటేష్ ఇద్దరూ కొత్త సినిమాలకు సైన్ చేసి ఉండటంతో చిత్రీకరణను వీలైనంత త్వరగా ముగించే పనిలో ఉన్నారు అనిల్ రావిపూడి. ‘ఎఫ్ 2’ భార్య భర్తల గొడవల నేపథ్యంలో ఉంటే ఈ సీక్వెల్ మాత్రం డబ్బు నేపథ్యంలో ఉండనుంది. ‘ఎఫ్ 2’ కు మించిన ఫన్ ఇందులో ఉండేలా చూసుకుంటున్నారు అనిల్ రావిపూడి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై బిజినెస్ వర్గాల్లోనూ డిమాండ్ ఉంది. ఇందులో కూడా తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.