హాట్ టాపిక్ గా మారిన ‘యానిమల్’ బ్యూటీ

హాట్ టాపిక్ గా మారిన ‘యానిమల్’ బ్యూటీ

Published on Dec 3, 2023 8:00 PM IST

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో కలయికలో వచ్చిన సినిమా యానిమల్. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న కంటే మరో పాత్ర పోషించిన హీరోయిన్ ‘తృప్తి డిమ్రీ’ నే హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో తృప్తి బోల్డ్‌గా రెచ్చిపోయింది. దీంతో సినిమా చూసిన వారంతా ఈ బ్యూటీ పై కామెంట్స్ చేస్తున్నారు. దాంతో తృప్తి డిమ్రీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఫలితంగా తృప్తి డిమ్రీ పిక్స్ కూడా వైరల్‌గా మారాయి.

తృప్తి డిమ్రీ బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేసింది. అలాగే, కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా ఆమె తన గ్లామర్ తో సినిమాకి ప్లస్ అయ్యింది. మొత్తానికి హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. రణబీర్ కపూర్ నటన, భారీ వైల్డ్ యాక్షన్ సీన్స్, బోల్డ్ ఎలిమెంట్స్ కారణంగా ఈ సినిమా మొత్తానికి హిట్ ను సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు