ఇంటి మీద నుండి కిందపడి గాయాలపాలైన స్టార్ నటుడు

Published on Mar 4, 2021 1:29 am IST

ఇటీవల సినిమా సెట్లలో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట నిత్యం ప్రమాదాలు జరగడం నటులు గాయపడటం నిత్యం వింటూనే ఉన్నాం. ‘ఇండియన్ 2’ షూటింగ్లో జరిగిన క్రేన్ ప్రమాదం నుండి ఆర్య, అజిత్, టోవినో థామస్ ఇలా పలువురు ప్రమాదాలకు గురికాగా ఇప్పుడు మరోక నటుడు, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ‘మలయన్ కుంజు’ అనే సినిమాలో నటిస్తున్నారు.

షూటింగ్లో భాగంగా ఒక ఇంటి సెట్ నిర్మించారు. ఆ ఇల్లు కూలిపోతున్న సమయంలో ఫహాద్ ఫాజిల్ ఆ ఇంటిపై నుండి దూకి తప్పించుకోవడమేది షాట్. ఆ షాట్ చేస్తుండగా ఫహాద్ పట్టు తప్పి ఇంటి మీద నుండి కింద పడ్డారట. ఆయన ముక్కుకు బలమైన గాయమే అయిందట. యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయం పెద్దదే అయినా ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదమూ లేదని అంటున్నారు. ఈ సంగతి తెలిసిన వెంటనే అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఫహాద్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. హీరోయిన్ నజ్రియాను పెళ్లాడిన ఫహాద్ ఫాజిల్ ‘బెంగుళూరు డేస్, ట్రాన్స్, కుంభళంగి నైట్స్’ లాంటి చిత్రాలతో బెస్ట్ పెర్ఫార్మర్ అనే పేరు తెచ్చుకున్నారు.

సంబంధిత సమాచారం :