‘విక్రమ్’ కు విలన్ ఫైనల్ అయినట్టే

Published on Apr 8, 2021 2:02 am IST

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న కొత్త చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మొదట్లో విజయ్ సేతుపతి పేరు వినిపించినా కూడ ఆ తర్వాత ఫహాద్ ఫాజిల్ పేరు తెర మీదకు వచ్చింది.

ఇన్నిరోజులు ఇది కేవలం ఒక ఊహాగానంగానే ఉన్నా ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయిపోయింది. ప్రతినాయకుడిగా అతనే ఫైనల్ అయ్యారట. ఈమధ్య కాలంలో మలయాళంలో వచ్చిన మంచి సినిమాల్లో ఫహాద్ ఫాజిల్ చేసిన సినిమాలు చాలావరకు ఉన్నాయి. ‘ట్రాన్స్, కుంభలంగి నైట్స్, మహేషింటే ప్రతీకారం’ లాంటి సినిమాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇటీవలే ఫహాద్ ఫాజిల్ తెలుగులో సుకుమార్, అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప’లో కూడ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :