టాలీవుడ్ లో ఎన్నో మరపు రాణి చిత్రాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గుండెపోటుతో మరణించాడు. ఇది జరిగి నెల రోజులు కూడా కాకుండానే ఆస్థి విషయంలో అత్తా కోడళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం చక్రి భార్య అయిన శ్రావని తను ఉన్న ఇంటిని, అలాగే మిగిలిన ఆస్తి పత్రాల మీద సైన్ చేసి ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపొమ్మని చక్రి తల్లి, కూతుళ్ళు టార్చర్ చేస్తున్నారని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.
అలాగే శ్రావని మానవ హక్కుల సంఘంలో కూడా తనకి తమ తోడికోడళ్ళ నుంచి, చక్రి తల్లి నుండి రక్షణ కావాలని ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా చక్రి మరణానికి కూడా వారే కారణం అని, వాళ్ళే విషం పెట్టి చంపేశారని, కానీ పోస్ట్ మార్టంలో తెలియకుండా మేనేజ్ చేసారని మీడియాకి తెలిపింది. ఇదిలా ఉంటే చక్రి తల్లి మాత్రం శ్రావణినే చక్రికి విషం పెట్టి చంపేసిందని, తన వల్లే తన కొడుకు చనిపోయాడని కంప్లైంట్ ఇస్తోంది.
