‘ఫ్యామిలీ స్టార్’ :ఆ రెండు వెర్షన్స్ రిలీజ్ ఇక లేనట్లేనా ?

‘ఫ్యామిలీ స్టార్’ :ఆ రెండు వెర్షన్స్ రిలీజ్ ఇక లేనట్లేనా ?

Published on Apr 12, 2024 10:20 PM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఇటీవల తెలుగు, తమిళ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.

విషయం ఏమిటంటే, తమ మూవీని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన రెండు వారాల అనంతరం హిందీ, మలయాళం వెర్షన్స్ యొక్క రిలీజ్ ని ప్రకటిస్తాం అని ప్రమోషనల్ ఈవెంట్స్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలిపారు. అయితే ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయి ఒక వారం గడిచినప్పటికీ కూడా ఆ రెండు వెర్షన్స్ రిలీజ్ పై మేకర్స్ నుండి ఇంకా క్లారిటీ లేదు.

కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం త్వరలో ఓటిటి టైంలోనే డైరెక్ట్ గా ఆ రెండు వెర్షన్స్ ఆడియన్స్ కి అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఇంకా ఈ మూవీలో జగపతి బాబు, రోహిణి హట్టంగడి, వెన్నెల కిషోర్, వాసుకి, అభినయ కీలక పాత్రలు పోషించగా గోపి సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు