‘ఫ్యామిలీ స్టార్’ : ఇంట్రెస్టింగ్ గా సెన్సార్ టాక్ ?

‘ఫ్యామిలీ స్టార్’ : ఇంట్రెస్టింగ్ గా సెన్సార్ టాక్ ?

Published on Mar 29, 2024 10:00 PM IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 న తెలుగు, తమిళ భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీని పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆకట్టుకుని విజయ్ ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచింది ఈ మూవీ.

విషయం ఏమిటంటే, తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ వారి నుండి మంచి ప్రసంశలు దక్కినట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అన్నివర్గాల ఆడియన్స్ ని ఈ మూవీ ఆకట్టుకోవడంతో పాటు విజయ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఫ్యామిలీ స్టార్ నిలిచిపోతుందని వారు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే ఫ్యామిలీ స్టార్ సెన్సార్ డీటెయిల్స్ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు