“ఫ్యామిలీ స్టార్”.. ఇంకా చివరి పనుల్లోనే

“ఫ్యామిలీ స్టార్”.. ఇంకా చివరి పనుల్లోనే

Published on Apr 3, 2024 8:59 AM IST


సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “ఫ్యామిలీ స్టార్” (Vijay Devarakonda) కోసం తెలిసిందే.. మరి సాలిడ్ ప్రమోషన్స్ ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం నిన్ననే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకుంది. మరి ఇంకా సినిమా మరొక్క రోజులో థియేటర్స్ లోకి రానుంది అనగా ఇంకా చివరి నిమిషం పనులు కంప్లీట్ చేసుకుంటుంది.

జెనరల్ గా సినిమా ప్రీ రిలీజ్ కే దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నిటిని ఏ సినిమా అయినా కంప్లీట్ చేసుకుంటుంది. కానీ ఫ్యామిలీ స్టార్ కి ఇప్పటికీ డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తాజాగానే స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తన డబ్బింగ్ ని కంప్లీట్ చేసాడు. దీంతో ఇలా చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే మేకర్స్ బిజీగా ఉన్నారు. మరి సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు సహా తమిళ్ హిందీ భాషల్లో ఈ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు