ఆ డేట్ నా లక్కీ డేట్ – దిల్ రాజు

ఆ డేట్ నా లక్కీ డేట్ – దిల్ రాజు

Published on Apr 1, 2024 3:09 PM IST

విజయ్ దేవరకొండ – మృణాల్ ఠాకూర్ కలయికలో రాబోతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమా రిలీజ్ పై నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘దిల్’ సినిమా ఏప్రిల్ 5నే విడుదలైందని దిల్ రాజు తెలిపారు. మొత్తానికి ఏప్రిల్ 5 అనేది తనకు లక్కీ డేట్ అని దిల్ రాజు చెప్పారు.

కాబట్టి, అదే తేదీన విడుదల చేస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందని.. ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో 70% ప్రేమ కథ, 30% ఫ్యామిలీ డ్రామా ఉంటుందని దిల్ రాజు తెలిపాడు. కాగా ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఏప్రిల్ 5న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ ఫ్యామిలీ స్టార్‌ చిత్రంలో అభినయ, వాసుకి, రోహిణి, రవిబాబు తదితరులు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు