‘ఫ్యామిలీ స్టార్’ : వారి కోసం స్పెషల్ ప్రీమియర్స్

‘ఫ్యామిలీ స్టార్’ : వారి కోసం స్పెషల్ ప్రీమియర్స్

Published on Apr 1, 2024 5:47 PM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈమూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించగా యువ అందాల నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఏప్రిల్ 4న మీడియా పర్సన్స్ తో పాటు ప్రత్యేకంగా పలువురు ఫ్యామిలీస్ తో ఈ మూవీ యొక్క స్పెషల్ ప్రీమియర్ ని ఏర్పాటు చేసారు మేకర్స్. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అభినయ, వాసుకి, రోహిణి హట్టంగడి, రవి బాబు వంటి వారు కీలక పాత్రలు చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీకి గోపిసుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు