‘ఫ్యామిలీ స్టార్’ : ఆసక్తికర విషయాలను వెల్లడించిన విజయ్ దేవరకొండ

‘ఫ్యామిలీ స్టార్’ : ఆసక్తికర విషయాలను వెల్లడించిన విజయ్ దేవరకొండ

Published on Apr 3, 2024 11:02 PM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ స్టార్ కు గోపి సుందర్ సంగీతం అందించారు. ఏప్రిల్ 5న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

తాజాగా ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ మాట్లాడుతూ, ఈ మూవీ యొక్క కథ చెప్పే సమయంలో పలు సందర్భాల్లో నేను, పరశురామ్ ఇద్దరం ఎంతో నవ్వుకున్నాం. ఇందులోని చాలా సన్నివేశాలు నా జీవితంలో జరిగినవి, అలానే ఇందులోని కొన్ని పాయింట్స్ మీ అందరికీ కూడా రిలేట్ అవుతాయని అన్నారు. ఇక తమ జీవితాల్లో నిత్యం జరిగే ఘటనలను తెర పై చూసి ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారని విజయ్ అన్నారు. ప్రతి ఇంటికీ ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటాడు, ఇందులో హీరో గోవర్ధన్, అతని ప్రేమ, కోపం మరియు క్రోధం చాలా అంశాలు ఆకట్టుకుంటాయి. అలానే మధ్యలో సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ కథ రిలేట్ అవుతుంది, అయితే వినోదానికి కూడా కొరత ఉండదని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు