‘తండేల్’ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ ?

‘తండేల్’ ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ ?

Published on Feb 27, 2024 2:02 AM IST

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోన్న ఈ మూవీ పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ యొక్క ఓవర్సీస్ రైట్స్ ని తాజాగా ప్రముఖ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా రిలీజ్ అనంతరం తండేల్ మూవీ మంచి విజయం అందుకోవడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు