‘మనీ హెయిస్ట్’ లవర్స్ కి “బెర్లిన్” రిలీజ్ డేట్

‘మనీ హెయిస్ట్’ లవర్స్ కి “బెర్లిన్” రిలీజ్ డేట్

Published on Dec 8, 2023 9:00 AM IST

వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ఓటిటి కంటెంట్ లో మంచి పాపులర్ అయ్యినటువంటి బిగ్గెస్ట్ హిట్ సిరీస్ లలో స్పానిష్ సిరీస్ అయినటువంటి “లకసా డి పాపెల్” కూడా ఒకటి. ఇంగ్లీష్ లో “మనీ హెయిస్ట్” గా దిగ్గజ స్ట్రీమింగ్ యాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ మొత్తం ఐదు సీజన్స్ గా అందుబాటులో ఉండగా ఇండియాలో కూడా అనేకమంది ఈ సిరీస్ కి అందులో పాత్రలకి ఫ్యాన్స్ ఉన్నారు.

మరి ఈ సిరీస్ లో చాలా మందికి ఉన్న మోస్ట్ ఫేవరేట్ పాత్రల్లో “బెర్లిన్” కూడా ఒకటి. స్పానిష్ నటుడు పెడ్రో అలాన్సో నటించిన ఈ రోల్ కి మంచి క్రేజ్ ఉంది. దీనితో ఈ పాత్రపై సెపరేట్ గా ఓ సిరీస్ ని అనౌన్స్ చేయడంతో చాలా మంది ఎగ్జైట్ అయ్యారు. ఇక వారి అందరికీ ఆ సిరీస్ లవర్స్ కి కూడా ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. దీనితో ఈ బెర్లిన్ సిరీస్ ని అయితే నెట్ ఫ్లిక్స్ వారు ఈ డిసెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు