బాలయ్య నుంచి మోస్ట్ అవైటెడ్ మాస్ అప్డేట్ కూడా వస్తే..

Published on Mar 4, 2021 12:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బాలయ్య మరో ఆస్థాన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలయ్య కెరీర్ లోనే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి మేకర్స్ ఎప్పుడో విడుదల తేదీని ప్రకటించేసారు కానీ ఈ పవర్ ఫుల్ సబ్జెక్టు కు టైటిల్ ఏది ఫైనలైజ్ చేసారో అన్నది ఇంకా సస్పెన్సుగా కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇప్పటికే పలు ఆసక్తికర టైటిల్స్ వినిపిస్తున్నాయి కానీ ఏది ఫిక్స్ చేసారో తెలియాల్సి ఉంది. మరో పక్క ఈ శివరాత్రి సందర్భంగానే రివీల్ చేస్తారని కొన్ని రోజుల నుంచి గాసిప్స్ ఉన్నాయి కానీ మేకర్స్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి మూమెంట్ లేదు. దీనితో ఈ టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందా అని బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య ఈ మాస్ ట్రీట్ ను ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :