ప్రభాస్ పక్కా లోకల్ మాస్ మూవీ చేయాలట

ప్రభాస్ పక్కా లోకల్ మాస్ మూవీ చేయాలట

Published on Feb 20, 2020 11:40 AM IST

మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. ‘బాహుబలి’ తర్వాత ఆయనకు జాతీయ స్థాయి క్రేజ్ వచ్చినా మొదటి నుండి ఆయన్ను ఎక్కువగా అభిమానిస్తూ వచ్చింది మాస్ జనాలే. అందుకు కారణం ఆయన చేసిన ‘ఛత్రపతి, యోగి, బిల్లా, మిర్చి’ లాంటి లోకల్ తెలుగు ఫ్లేవర్ ఉన్న మాస్ సినిమాలే. ఆ సినిమాలతోనే ఆయనకు మాస్ ఇమేజ్ బిల్డ్ అయింది.

కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా ఫార్ములాతో క్లాస్ ఫీల్ ఉన్న యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా చేసిన ‘సాహో’ అత్యున్నత సాంకేతికతో భారీగానే ఉన్నా పక్కా లోకల్ అనే ఫీలింగ్ కలగలేదు ప్రేక్షకులకు. ఇక ప్రస్తుతం చేస్తున్నది కూడా అలాంటి క్లాస్ సినిమానే. అందుకే ప్రభాస్ త్వరలో మన పూర్తి తెలుగు వాతావరణంలో ఒక యాక్షన్ ఎంటెర్టైనర్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి ప్రభాస్ అలాంటి సినిమాను ఎప్పుడు చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు