“సలార్” టీఆర్పీ పై నెలకొన్న ఆసక్తి!

“సలార్” టీఆర్పీ పై నెలకొన్న ఆసక్తి!

Published on May 3, 2024 12:02 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం, ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయ్యింది.

అయితే ఈ చిత్రం కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ రేపు వెలువడనుంది. అయితే ప్రభాస్ చివరి చిత్రాలు అయిన రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు 8.25 మరియు 9.47 టీఆర్పీ రేటింగులు రాబట్టాయి. ఇవి డీసెంట్ రెస్పాన్స్ అయినప్పటికీ, ప్రభాస్ స్టార్ పవర్ రేంజ్ కి తక్కువే. అయితే సలార్ చిత్రం ఇంతకుమించి టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు