ఏదైనా కొత్త విశేషం చెప్పొచ్చు కదా డార్లింగ్

ఏదైనా కొత్త విశేషం చెప్పొచ్చు కదా డార్లింగ్

Published on Oct 23, 2019 2:38 PM IST

ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్ 40వ పుట్టినరోజు. ఈ సందర్బాన్ని ఆయన అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక చోట్ల వివిధ సామాజిక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇంత సంతోషంలో కూడా వారికి ఒక వెలితి కనిపిస్తోంది. అది ప్రభాస్ వైపు నుండేనట.

ఈరోజు డార్లింగ్ పుట్టినరోజు.. కాబట్టి ఆయన
కొత్త సినిమాల గురించి ఏదైనా అప్డేట్ చెప్పవచ్చు కదా.. కనీసం ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో చేస్తున్న సినిమా నుండి ఏదైనా సప్రైజ్ ఇవ్వొచ్చు కదా అంటున్నారు. మరి వీరి కోరికను మన్నించి ఆ చిత్ర నిర్మాతలు సాయంత్రంలోపు ఏదైనా కొత్త విషయం చెబుతారేమో చూడాలి.

గోపిక్రిష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్లో మొదలుకానుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు