“సలార్”..ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్

“సలార్”..ఈ విషయంలో ఫ్యాన్స్ డిజప్పాయింట్

Published on Nov 30, 2023 9:06 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “సలార్” కోసం ఇప్పుడు ఆడియెన్స్ ఇండియా వైడ్ గా ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ కి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. కానీ ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ డిజప్పాయింట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ట్రైలర్ రిలీజ్ హడావిడి సోషల్ మీడియాలో బాగానే ఉంది కానీ ఇప్పటికీ ఎలాంటి కొత్త పోస్టర్ లని రిలీజ్ చేయకపోవడం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయకపోవడం విషయంలో మాత్రం వారు డిజప్పాయింట్ గా ఉన్నారు. సినిమాపై ఉన్న హైప్ కి మేకర్స్ ఇస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కి సంబంధం లేదని అనుకుంటున్నారు. మరి ట్రైలర్ రిలీజ్ తర్వాత నుంచి మంచి అగ్రెసివ్ ప్రమోషన్స్ సరికొత్త కంటెంట్ తో మేకర్స్ ఇదంతా ఏమన్నా మారుస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు