ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్.. ఊగిపోతున్న ఫ్యాన్స్

ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్.. ఊగిపోతున్న ఫ్యాన్స్

Published on Oct 4, 2019 8:11 PM IST

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ప్రధానంగా ఈ ఇద్దరు స్టార్ హీరోలని రాజమౌళి ఎలా చూపుతాడో, ఎవరి లుక్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో అధికంగా ఉంది.

ఇప్పటి వరకు అధికారికంగా వీరి లుక్స్ బయటకు రాలేదు. కానీ చరణ్ ‘సైరా’ పనుల్లో భాగంగా ఈమధ్య ఎక్కువగా బయట కనిపించడంతో ఆయన లుక్ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చారు. ఇక ఎన్టీఆర్ పెద్దగా కనిపించకపోవడంతో ఆయన మేకోవర్ మీదే అందరి దృష్టి పడింది.

తాజాగా సోషల్ మీడియాలో యాడ్ షూట్లో తీసిన తారక్ క్లోజప్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఎన్టీఆర్ బాగా సన్నబడి కొత్తగా కనిపిస్తున్నారు. ఆ ఇంటెన్స్ లుక్ చూసిన ఫ్యాన్స్ ‘యమదొంగ’లో ఎన్టీఆర్ ఎంత కొత్తగా కనబడ్డారో ‘ఆర్ఆర్ఆర్’లో అలానే కనిపిస్తాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు