‘బన్నీ – సుకుమార్’ సినిమా లాంచ్.. మరో హిట్ ఆల్బమ్ !

‘బన్నీ – సుకుమార్’ సినిమా లాంచ్.. మరో హిట్ ఆల్బమ్ !

Published on Oct 30, 2019 10:38 AM IST

allu2

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటారు. ఖచ్చితంగా మంచి పాటలు ఉండేలా చూస్తారు. దర్శకుడు సుకుమార్ కూడా అంతే. ఆయన ప్రతి సినిమాలో హిట్ ఆల్బమ్ గ్యారెంటీ. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నిటికీ దేవిశ్రీయే సంగీతం అందించారు. అన్నీ కూడా హిట్ పాటలే.

అందుకే ఈసారి కూడా సుకుమార్, బన్నీ ఇద్దరూ తమ కొత్త చిత్రానికి సంగీతం సమకూర్చే భాద్యతను దేవిశ్రీకే అప్పగించారు. దేవి సైతం ఏనాడూ వీరి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. గతంలో సుకుమార్, బన్నీలు చేసిన ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాలకు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు దేవి. దీంతో ఈసారి కూడా అలాంటి మంచి పాటలే ఉంటాయని నమ్మకంగా ఉన్నారు అభిమానులు.

ఇకపోతే ఈరోజే లాంఛ్ అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్న కథానాయుకగా నటించనుంది. బన్నీ ‘అల వైకుంఠపురములో’ పనులు పూర్తవగానే ఈ సినిమా పనులు మొదలుపెడతారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు