మహేష్ నెక్స్ట్ సినిమా ఎందుకంత స్పెషల్ !

Published on May 30, 2019 2:31 pm IST

‘మహర్షి’ విజయాన్ని ఎంతగానో ఆస్వాదించిన సూపర్ స్టార్ మహేష్ బాబు అదే ఉత్సాహంతో తన 26వ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. రేపు ఉదయం 9: 18 గంటలకు సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛ్ కానుంది. ఈ సినిమాను మహేష్ గత సినిమాలకంటే ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నారు అభిమానులు. ఎందుకంటే.. చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి కాబట్టి.

మహేష్ గత ఐదు సినిమాలను చూస్తే బ్రహ్మోత్సవం మినహా శ్రీమంతుడు, స్పైడర్, భరత్ అనే నేను, మహర్షి అంటూ సోషల్ మెసేజ్ ఉన్న కథలే చేస్తూ వచ్చారు. అన్నిటిలోనూ ఆయన పాత్ర తీరు ఒకేలా ఉండటంతో ఆడియన్స్ ఈసారి ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ పాత ప్రాజెక్టుల్ని సైతం పక్కనబెట్టి రావిపూడికి డేట్స్ ఇచ్చారు. రావిపూడి కూడా మహేష్ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ ఒకటి తయారుచేశారట.

చాన్నాళ్ల తర్వాత సీరియస్ పాత్రలకు బ్రేక్ ఇచ్చి ఫన్ ఉన్న పాత్రలో మహేష్ కనిపిస్తాడనే సరికి సినిమా ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. రష్మిక మందన్న ఈ కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు.

సంబంధిత సమాచారం :

More