సూర్య అభిమానులకి నమ్మకం ఏర్పడింది

సూర్య అభిమానులకి నమ్మకం ఏర్పడింది

Published on Jan 9, 2020 2:10 PM IST

Surya

హీరో సూర్యకు గత కొన్నాళ్ళుగా సరైన హిట్ లేకపోవడంతో ఆయన అభిమానులు కొంత నిరుత్సాహంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న ‘సూరరై పొట్రు’ సినిమా అయినా విజయం సాధించాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. వారి ఆశలకు బలం చేకూర్చింది ‘సూరరై పొట్రు’ టీజర్.

ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ ఫౌండర్ పైలట్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం భావోద్వేగపూరితంగా సాగింది. అందులో సూర్య లుక్స్, అభినయం, కథాంశం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అందరికీ నమ్మకం ఏర్పడింది. ‘గురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ యేడాది వేసవికి చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు