బన్నీ పుట్టినరోజుకు అభిమానుల స్పెషల్ ప్లాన్స్ !

వరుస హిట్లతో స్టార్ హీరోల సరసన చేరిపోయిన నటుడు అల్లు అర్జున్ కు ఫ్యాన్ బేస్ కూడ బాగా పెరిగింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే గాక పక్క రాష్ట్రాల్లో కూడ ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు తయారయ్యారు. ఈ నెల 8న బన్నీ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు సెలబ్రేషన్స్ కు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.

వాటిలో భాగంగా వసతులు సరిగాలేని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కనీస అవసరాల కోసం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అలాగే బన్నీ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్ర టీమ్ అభిమానుల కోసం 8వ తేదీన సినిమా నుండి డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. మే 4న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేశారు.