మహేష్ కావాలంటుంటే ఫ్యాన్స్ వద్దంటున్నారట

Published on May 30, 2019 11:15 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ చిత్రం రేపు ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు “ఎఫ్ 2″తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా..అనిల్ సుంకర నిర్మించబోతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే మహేష్ కి ఫ్యాన్స్ కి ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ ప్రాజెక్ట్ ని అనుకున్నప్పటినుండి దేవి శ్రీ నే మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్సయిపోయారట మహేష్ మరియు దర్శకుడు, నిర్మాత. ఐతే ఫ్యాన్స్ మాత్రం దేవిని మార్చాల్సిందేనని పట్టుపడుతున్నారట.

మహేష్ ఫ్యాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణం లేకపోలేదు. మహేష్ నటించిన తాజా చిత్రం “మహర్షి” చిత్రానికి దేవి గొప్పగా మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. అంతకు ముందు చేసిన “భరత్ అనే నేను కు సైతం” నామమాత్రపు మ్యూజికే ఇచ్చాడు అని వీరి అభిప్రాయం.ఈ విషయంలో మహేష్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి. మహేష్ సరసన రష్మిక హీరోయిన్ నటిస్తుండగా, రమ్యకృష్ణ,విజయశాంతి లాంటి సీనియర్ హీరోయిన్స్ కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More