విశ్రాంతి లేని ప్రభాస్.. లేటెస్ట్ లుక్ తో ఫ్యాన్స్ వర్రీ

విశ్రాంతి లేని ప్రభాస్.. లేటెస్ట్ లుక్ తో ఫ్యాన్స్ వర్రీ

Published on May 18, 2024 10:57 AM IST

ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ మరియు బిజీ హీరోస్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. మరి ప్రభాస్ ఇప్పుడు వరుసగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో “కల్కి 2898 ఎడి” (Kalki 2898 AD) విడుదలకి ఆల్రెడీ సిద్ధంగా ఉంది. ఇక దీనితో పాటుగా “ది రాజా సాబ్” (The Raja Saab) ని కూడా ప్రభాస్ చేస్తున్నాడు. అయితే ఇటీవల ఈ రెండు సినిమాలు షూటింగ్ లలో ప్రభాస్ నిర్విరామంగా పాల్గొన్నాడు.

అయితే లేటెస్ట్ గా ప్రభాస్ సంబంధించి ఓ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ గా మారుతుంది. ఇందులో ప్రభాస్ తాలూకా నయా లుక్ కనిపించింది. కానీ ఇది చూసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం కొంచెం వర్రీ అవుతున్నారు. అసలు ప్రభాస్ అంటేనే ఆ కటౌట్ కి తగ్గట్టు సాలిడ్ పర్శనాలిటీ మరియు మంచి చార్మ్. కానీ ఈ తాజా లుక్ లో తన గ్లో తగ్గినట్టుగా అనిపించింది. అలాగే తనకి ఎక్కువ రెస్ట్ లేనట్టుగా కూడా అనిపిస్తుంది.

దీనితో సినిమా కోసం తాను ఎలా వర్క్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఈ తాజా లుక్ మాత్రం అభిమానులని కొంచెం కలవరపెట్టింది. తమ అభిమాన హీరో కొంచెం గ్యాప్ తీసుకొని అయినా తన ఆరోగ్యం చూసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ సోషల్ మీడియాలో మంచి యాక్టీవ్ గా అయ్యి సాలిడ్ పోస్ట్ తో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు