ట్విట్టర్ వేదికగా మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోతో దిగిన ఫోటోలు సోషల్ మాధ్యమాలలో షేర్ చేస్తూ తమ అభిమానం చాటుతున్నారు. కొద్దిరోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రచారంలో భాగంగా మహేష్ అభిమానులకు ఆయనతో కలిసి ఫోటో దిగే అవకాశం నిర్మాతలు కల్పించారు. హైదరాబాద్ నగర శివారులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానుల నుండి విశేష ఆదరణ లభించింది. మహేష్ తో కలిసి ఫోటో దిగడానికి అభిమానులు పోటీ పడ్డారు. అలా ఫోటోలు దిగిన అభిమానులు ఆ ఫొటోలను ట్విట్టర్ మరియు పేస్ బుక్ వంటి సోషల్ మాధ్యమాలలో పంచుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఊహకు మించి అభిమానులు హాజరుకావడంతో ఈ కార్యక్రమంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు తెలుస్తుంది. ఇక జనవరి 11న సంక్రాతి కానుకగా విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కి సిద్ధంగా ఉన్నట్లు నిర్మాత తెలిపారు. మహేష్ మేజర్ అజయ్ కృష్ణ గా చేస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


