
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి ఈ చిత్ర టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నాడు. ఆ ముగ్గురు భామలే సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత. ఇక్కడ అందరినీ కాస్త షాక్ చేస్తున్న విషయం. మహేష్ బాబు మొదటి సారి ముగ్గురు హీరోయిన్స్ తో కలిసి నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ మహేష్ బాబు తన కెరీర్లో ఇద్దరు హీరోయిన్స్ తో చేసిన సినిమాలే రెండు, అవే యువరాజు, టక్కరి దొంగ. ఆ సినిమాల తర్వాత మహేష్ బాబు ఒక్క సారిగా ఇద్దరు హీరోయిన్స్ తో సినిమా చేయలేదు.
దాంతో మొదటిసారి మహేష్ ముగ్గురు అందాల భామలతో రొమాన్స్ చేస్తున్నాడనగానే అభిమానులు థ్రిల్ ఫీలవుతున్నారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మహేష్ సరసన ఈ ముగ్గురు భామలని ఎలా చూపిస్తాడా అని ఆసక్తి మొదలైంది. జూలై 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. పరమ్ వి పొట్లూరి పివిపి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను డిసెంబర్ కల్లా పూర్తి చేసి 2016 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.

