30 ఏళ్లు దాటాకే పెళ్లి.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

30 ఏళ్లు దాటాకే పెళ్లి.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

Published on Apr 28, 2024 6:44 PM IST

‘జాతి రత్నాలు’ సినిమాతో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా హిట్ అందుకుంది. ప్రసుతం అల్లరి నరేష్ హీరోగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా అబ్దుల్లా తన పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నా పెళ్లి విషయంలో నాకు అంటూ కొన్ని స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని ఫరియా అబ్దుల్లా చెప్పింది.

ఫరియా అబ్దుల్లా ఇంకా మాట్లాడుతూ.. ‘నేను 30 ఏళ్లు దాటాకే నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. అయితే, కచ్చితంగా నేను ప్రేమ వివాహమే చేసుకుంటాను. నా మనసులోని మాటను నేను ఇలా ఓపెన్ గా చెప్పాను’ అంటూ ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఇక ఆమె నటించిన ‘ఆ ఒక్కటీ.. అడక్కు’ సినిమా మే 3న థియేటర్లలోకి రానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు