అయోధ్య లో చిరంజీవి – రామ్ చరణ్!

అయోధ్య లో చిరంజీవి – రామ్ చరణ్!

Published on Jan 22, 2024 12:06 PM IST


అయోధ్య రామ మందింరం ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కి ఆహ్వానం అందిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న అయోధ్య కి చేరుకొనే ముందు అభిమానులని పలకరించారు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్. నేడు అయోధ్య కి తండ్రీ కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు వచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటో లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేఖ, తేజ్ నారాయణ అగర్వాల్ మరియు అభిషేక్ అగర్వాల్ లు కూడా ఉన్నారు.

రామ్ చరణ్ ను మరియు మెగాస్టార్ చిరంజీవి ను ఒకే ఫ్రేమ్ లో ఇలా చూడటం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రం తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు