‘ఫౌజీ’ మేకర్స్ పై ప్రెషర్.. అప్డేట్ రావాల్సిందే..!

‘ఫౌజీ’ మేకర్స్ పై ప్రెషర్.. అప్డేట్ రావాల్సిందే..!

Published on Jul 8, 2026 3:59 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘ఫౌజీ’పై టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో, స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. అయితే, సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థపై అసహనం వ్యక్తం చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

​ఈ క్రమంలో ఈ చిత్ర డిజిటల్ హక్కులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘ఫౌజీ’ డిజిటల్ రైట్స్‌ను భారీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. అయితే, ఈ డీల్‌లో భాగంగా వారు ఒక డెడ్‌లైన్‌ను కూడా విధించారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ నాటికి థియేటర్లలో విడుదల చేయాలని, ఒకవేళ ఆ గడువు తప్పితే డీల్ ప్రైస్‌ను తగ్గించడం లేదా ఒప్పందంలో మార్పులు చేయడం జరుగుతుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. దీంతో మేకర్స్ అలర్ట్ అయ్యారు.

​నెట్‌ఫ్లిక్స్ పెట్టిన డెడ్‌లైన్ ప్రకారం, చిత్ర యూనిట్ మిగిలిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ పాన్-ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, రికార్డు బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గడువులోగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో పాటు, త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించడానికి మైత్రీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు