5 దేశాల్లో ట్రెండ్ అవుతోన్న “దేవర” ఫియర్ సాంగ్!

5 దేశాల్లో ట్రెండ్ అవుతోన్న “దేవర” ఫియర్ సాంగ్!

Published on May 21, 2024 4:13 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర (Devara). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ అయిన ఫియర్ సాంగ్ ను మేకర్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ పాట ఐదు దేశాల్లో ట్రెండ్ లో నిలిచింది. ఈ చిత్రం లో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ ఈ చిత్రంకి సంగీతం అందిస్తున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం తో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు