యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, అందాల భామ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉండగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అవుట్ అండ్ అవుట్ ప్యూర్, ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీగా కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తుంటే, కిరణ్ అబ్బవరం ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టి రొమాంటిక్ హిట్ కొట్టబోతున్నాడని స్పష్టమవుతోంది.
ట్రైలర్ విషయానికొస్తే.. చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక అందమైన ప్రేమకథను ఇందులో చూపించారు. ఇద్దరు భిన్నమైన మనస్తత్వాలు కలిగిన యువతీ యువకుల మధ్య చిగురించిన పరిచయం, ఆపై ప్రేమ.. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎదురైన ఊహించని మలుపులు, ఎమోషన్స్ చుట్టూ కథను చాలా నేచురల్‌గా నడిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం తన లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీతో మెప్పించగా, హీరోయిన్‌తో అతని కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్ ట్రైలర్‌లో మేజర్ హైలైట్‌గా నిలిచాయి.
ఇక సాయి రాజేష్, ఎస్.కె.ఎన్ మార్క్ మేకింగ్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో విడుదలైన ‘జిగితార’ సాంగ్ లాగే, ట్రైలర్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సినిమాటోగ్రఫీ విజువల్స్ ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లేలా ఉన్నాయి. జూలై 24న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


