‘ఫీల్ మై లవ్’ టైటిల్ పోస్టర్ విడుదల

ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫీల్ మై లవ్’. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు, దర్శకుడు రాధాకృష్ణన్ పార్తిబన్ తాజాగా విడుదల చేశారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏ.ఎన్. బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, హరి ప్రకాష్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు.

చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. త్వరలో మున్నార్‌లో జరగనున్న ఆఖరి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి కానుంది. ఈ చిత్రానికి రాజరవివర్మ ఎస్, బాలసుబ్రహ్మణ్యన్ జి సంగీతం అందిస్తుండగా, ఎం.ఎస్. సతీష్ సినిమాటోగ్రాఫర్‌గా, అజయ్ మనోజ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇందులో రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఆడియో, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Exit mobile version