టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ !

టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ !

Published on Jan 3, 2020 4:59 PM IST

world famous lover

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా రాబోతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కాగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఈ సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు రిలీజ్ అయింది. యూత్ ని అండ్ లవర్స్ ను టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ టీజర్ లో ఎమోషన్, లవ్ అండ్ పెయిన్ ముఖ్యంగా బోల్డ్ నెస్ బాగా హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న లవర్స్ డే రోజున ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా మొదటసారి తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు