మామా అల్లుళ్ళ పండగ పోజు అదిరిందిగా.

మామా అల్లుళ్ళ పండగ పోజు అదిరిందిగా.

Published on Sep 2, 2019 8:52 PM IST

పండుగ సందర్భంగా మామ వెంకీ, అల్లుడు చైతు ఎర్ర చొక్కా, పంచె కట్టులో దిగిపోయారు. పల్లెటూరి తిరునాళ్లలో సందడి చేస్తున్న వారి ఫోటో ఫ్యాన్స్ పండగ చేసుకొనేలా ఉంది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వెంకీ మామ చిత్ర యూనిట్ వెంకటేష్, నాగ చైతన్య కలిసివెళుతున్న ఆకర్షణీయమైన పోస్టర్ ని విడుదల చేశారు. ఒకే దుస్తులలో సంబరంగా వెళుతున్న ఆ ఇద్దరి ఫోటో ఆసక్తికరంగా ఉంది.

దర్శకుడు బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెంకీ మామా చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని సమాచారం. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు