మహేష్, బన్నీల మధ్య పోటీ ఓ రేంజ్ లో సాగుతుందిగా..!

మహేష్, బన్నీల మధ్య పోటీ ఓ రేంజ్ లో సాగుతుందిగా..!

Published on Dec 12, 2019 10:10 AM IST

ఈ సంక్రాంతికి మహేష్-బన్నీ బాక్సాపీస్ వద్ద పోటీపడనున్నారు. ఒకరోజు వ్యవధిలో వీరి తాజా చిత్రాలైన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో విడుదల కానున్నాయి. సంక్రాంతి సీజన్లో సినిమాలకు డిమాండ్ ఎక్కువ. ఒకేసారి బాక్సాఫీస్ వద్ద రెండు మూడు చిత్రాలు విడుదలైనప్పటికీ అన్ని సినిమాలకు ఆదరణ దక్కుతుంది. ఐతే హిట్ టాక్ తెచ్చుకున్న మూవీకి మంచి వసూళ్లు దక్కుతాయి. కాగా విడుదలకు ముందే సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురంలో చిత్రాలు యూట్యూబ్ లో పోటీపడుతున్నాయి. యూట్యూబ్ ట్రెండింగ్ లో నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి.

అలవైకుంఠపురంలో పాటలతో బన్నీ యూట్యూబ్ రాంపేజ్ మొదలుపెట్టగా మహేష్ టీజర్ తో ఒక్కసారిగా దూసుకుపోయాడు. ఇక టాప్ ట్రెండింగ్ లో ఉన్న బన్నీ టీజర్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ని మహేష్ సూర్యుడివో..చంద్రుడివో..సాంగ్ వెనక్కి నెట్టి టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. మహేష్ సాంగ్ ని నిన్న విదులైన బన్నీ అలవైకుంఠపురంలో టీజర్ వీడియో అధిగమించి టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఇలా అల్లు అర్జున్ మరియు బన్నీ తమ చిత్రాల సాంగ్స్ మరియు టీజర్స్ తో యూట్యూబ్ లో తలపడుతూ పోటీ ఆసక్తిగా మార్చుతున్నారు. ఇక నెక్స్ట్ సోమవారం సరిలేరు నీకెవ్వరు నుండి వచ్చే మూడవ సాంగ్ ఎంతవరకు ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు