ఇండియాలో “ఫైటర్” 3 రోజుల వసూళ్లు.!

ఇండియాలో “ఫైటర్” 3 రోజుల వసూళ్లు.!

Published on Jan 28, 2024 2:00 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా దీపికా హీరోయిన్ ఫా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ చిత్రం “ఫైటర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం డీసెంట్ బజ్ మధ్య రిలీజ్ అయ్యి మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్స్ ని అందుకుంది కానీ రెండో రోజు మాత్రం భారీ జంప్ ని తీసుకుంది. దీనితో ఈ చిత్రం మూడో రోజు కూడా సాలిడ్ వసూళ్లు అందుకుంటుంది అని టాక్ వచ్చింది.

కానీ మూడో రోజు మాత్రం ఈ చిత్రం మళ్ళీ డ్రాప్ చూసింది. మూడో రోజు ఈ చిత్రం 27.6 కోట్ల నెట్ వసూళ్లు ఇండియా వైడ్ గా అందుకుంది. దీనితో మొత్తం మూడు రోజుల్లో ఫైటర్ 93.4 మార్క్ ని టచ్ చేసింది. ఇక నాలుగో రోజు ఫుల్ హాలిడే కాబట్టి ఈరోజు గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ చిత్రం ఈ ఆదివారం ఎంత రాబడుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, రామన్ చిబ్, అజిత్ అంధరే, అంకు పాండే లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు