డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో చేస్తోన్న ‘ఫైటర్’ను ఫైట్ తో రీస్టార్ట్ చేయబోతున్నారు. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను ఈ నెల 26వ తేదీ నుండి హైదరాబాద్ లో జరగబోతుందట. ప్రత్యేకంగా వేసిన బాక్సింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ పై ముందుగా ఫైట్ సీన్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందట. డాన్ కొడుకు పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట.
కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ప్రస్తుతం ఈ సినిమా చేస్తోన్నాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.
