నార్త్ అమెరికా లో “ఫైటర్” సెన్సేషన్ వసూళ్లు!

నార్త్ అమెరికా లో “ఫైటర్” సెన్సేషన్ వసూళ్లు!

Published on Feb 11, 2024 11:02 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఫైటర్. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను రాబట్టక పోయినప్పటికీ, నార్త్ అమెరికా లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం తాజాగా 7 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. ఇది హృతిక్ రోషన్ కెరీర్ లో హయ్యెస్ట్ అని చెప్పాలి. వార్ చిత్రం నార్త్ అమెరికా లో 4.7 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో హృతిక్ నార్త్ లో తన ఆల్ టైమ్ రికార్డు ను క్రియేట్ చేశాడు అని చెప్పాలి.

అంతేకాక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకూ 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. నేడు ఆదివారం కావడం తో ఈరోజు కాస్త వసూళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు టాప్ గ్రాసర్ గా ఫైటర్ నిలిచింది. వయకాం స్టూడియోస్ మరియు మర్ఫ్లిక్ పిక్చర్స్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రం లో దీపికా పదుకునే, అనిల్ కపూర్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు